TDP Foundation Day : తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ నేటితో 41 వసంతాలు పూర్తి చేసుకుంది. 42వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఆత్మ గౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని ఆకాక్షించారు.
-
ఆత్మగౌరవ నినాదంతో పుట్టి... తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని కోరుకుంటూ...
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
జై తెలుగుదేశం.
జోహార్ ఎన్టీఆర్.#41stTDPFoundationDay pic.twitter.com/CLG5zexrt0
">ఆత్మగౌరవ నినాదంతో పుట్టి... తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని కోరుకుంటూ...
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2023
జై తెలుగుదేశం.
జోహార్ ఎన్టీఆర్.#41stTDPFoundationDay pic.twitter.com/CLG5zexrt0ఆత్మగౌరవ నినాదంతో పుట్టి... తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని కోరుకుంటూ...
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2023
జై తెలుగుదేశం.
జోహార్ ఎన్టీఆర్.#41stTDPFoundationDay pic.twitter.com/CLG5zexrt0
లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలం : తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా రాజకీయ చైతన్యానికి సంకేతంగా టీడీపీ ఆవిర్భవించి 41 ఏళ్లు అయ్యిందనీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అన్నగారి ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందన్నారు. బడుగుబలహీనవర్గాలకు భరోసా అవ్వడంతో పాటు మహిళల స్వావలంబనకు చేయూతనందించిందన్నారు. సకల రంగాల అభివృద్ధిపైనా టీడీపీ సంతకం చెరగనిదన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే టీడీపీ బలమని కొనియాడారు. నందమూరి తారకరాముని ఆశీస్సులు, చంద్రన్న దిశానిర్దేశంలో ప్రజాసంక్షేమమే లక్ష్యం, ప్రగతే ధ్యేయంగా దశాబ్దాలుగా టీడీపీ ప్రయాణం సాగుతోందని తేల్చి చెప్పారు. తాను తెలుగువాడినని సంతోషిస్తానన్న లోకేశ్, తను తెలుగుదేశం వాడినని గర్విస్తానన్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
-
రాష్ట్రాల ప్రగతే ధ్యేయంగా దశాబ్దాలుగా సాగుతోంది తెలుగుదేశం ప్రయాణం. నేను తెలుగువాడినని సంతోషిస్తాను. నేను తెలుగుదేశం వాడినని గర్విస్తాను. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.(3/3)#41stTDPFoundationDay
— Lokesh Nara (@naralokesh) March 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాష్ట్రాల ప్రగతే ధ్యేయంగా దశాబ్దాలుగా సాగుతోంది తెలుగుదేశం ప్రయాణం. నేను తెలుగువాడినని సంతోషిస్తాను. నేను తెలుగుదేశం వాడినని గర్విస్తాను. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.(3/3)#41stTDPFoundationDay
— Lokesh Nara (@naralokesh) March 29, 2023రాష్ట్రాల ప్రగతే ధ్యేయంగా దశాబ్దాలుగా సాగుతోంది తెలుగుదేశం ప్రయాణం. నేను తెలుగువాడినని సంతోషిస్తాను. నేను తెలుగుదేశం వాడినని గర్విస్తాను. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.(3/3)#41stTDPFoundationDay
— Lokesh Nara (@naralokesh) March 29, 2023
సమాజానికి సేవ చేయాలనే దృక్పథం : పేదల జీవితాల్లో వెలుగుల నింపాలన్న ధ్యేయంతోనే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు అన్నారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే సమాజం బాగుంటుందని కోరుకునే వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. పార్టీలు అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి వాటికి మనం కుంగిపోకుండా మరింత పుంజుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేసేందుకు పాటు పడాలని అన్నారు. ఎన్టీఆర్ యొక్క ఆలోచనలు, ఆశయాలను సమాజంలోకి తీసుకెళ్లటమే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని యనమల రామ కృష్ణుడు స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ యనమల శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లో ఆవిర్భావ దినోత్సవం : హైదరాబాద్-నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలను టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్‌లతో అలంకరించారు. ఈరోజు మధ్యాహ్నం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభాస్థలికి చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. . రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పాల్గొంటున్న ఈ సభ వేదికగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపాలని టీడీపీ భావిస్తోంది.
ఇవీ చదవండి