ETV Bharat / state

'జీవీ ఆంజినేయులపై కేసు అక్రమం.. ఇది దుర్మార్గం' - chandra babu fires on ysrcp rule

గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుపై పోలీసులు అక్రమ కేసు పెట్టారని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.

chandra babu fires vinukonda CI
chandra babu fires vinukonda CI
author img

By

Published : Feb 11, 2021, 8:38 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుపై పోలీసులు అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. తెదేపా హయాంలో ఏపీ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్న చంద్రబాబు.. వైకాపా పాలనలో కొందరు రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు.

వినుకొండ పట్టణ సీఐ వైకాపాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఏకగ్రీవం చేయకపోతే అక్రమ కేసులు పెడతానని బెదిరించడం హేయమని చంద్రబాబు అన్నారు. వినుకొండ సీఐనీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయంగా, ప్రజాస్వామ్యబద్దంగా కాకుండా అధికారజులుం ప్రదర్శించటం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజాగ్రహం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఒడిశా పిటిషన్​పై రేపు అత్యవసర విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.