ETV Bharat / state

గ్రంథాలయాల బలోపేతమే లక్ష్యంగా.. సరికొత్త పథకం - chadavadam Makishtam scheme launched at guntur news

పిల్లల్లో పఠనాసక్తిని పెంచడం, గ్రంథాలయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'చదవడం మాకిష్టం' పేరుతో రాష్ట్రప్రభుత్వం విద్యారంగంలోఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఏడాదిపాటు నాలుగు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్న ఈ కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించారు.

chadavadam Makishtam scheme launched
గ్రంథాలయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వ పథకం
author img

By

Published : Nov 29, 2020, 2:10 PM IST

గ్రంథాలయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వ పథకం

ఒకప్పుడు పుస్తక పఠనమంటే అందరికీ అమితమైన ప్రీతి. "పుస్తకం హస్తభూషణం" అంటూ ఎవరి చేతిలో చూసినా పుస్తకమే ఉండేది. డిజిటల్ కాలం వచ్చాక... పుస్తకాల పాత్ర పరిమితమైంది. గ్రంథాయాల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతున్నారు. గ్రంథాలయాలు, పుస్తకాల ముఖం చూడటానికి నేటి తరం.. ఇష్టపడటం లేదు. సమయాభావానికి తోడు పుస్తక పఠనమంటే ఆసక్తి లేకపోవడం, సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడమే ప్రధాన కారణం.

ఇలాంటి పరిస్థితిలో పుస్తక పఠనాన్ని మళ్లీ విద్యార్థులకు అలవాటు చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం 'చదవడం మాకిష్టం' కార్యక్రమం చేపట్టింది. గుంటూరులో ఈ కార్యక్రమాన్ని మంత్రులు ఆదిమూలపు సురేశ్, సుచరిత ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో గ్రంధాలయాలు, బుక్ రీడింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల పుస్తకాలు గ్రేడింగ్ చేసి పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. చిరిగిన పాత అరుదైన పుస్తకాలను చక్కదిద్దుతారు. కథలు, పుస్తకాలకు సంబంధించి విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తారు.

సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. నాలుగుదశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని సర్వశిక్షాభియాన్ అధికారులు తెలిపారు. కేవలం పాఠశాలల్లోనే కాకుండా ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ రీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పఠనాసక్తిని పెంచడంతోపాటు పాఠశాల విద్యకు మరింత మెరుగులు దిద్దే లక్ష్యంతో కార్యాచరణ అమలు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.