వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక రైలు విజయవాడ నుంచి రాజస్థాన్‌కి బయలుదేరింది. రాత్రి తెనాలి రెవెన్యూ డివిజన్లో ఉన్న రేపల్లె, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో ఉన్న 200 మంది వలస కార్మికులను విజయవాడ తరలించారు.
ముందుగా అందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి, వారికి సర్టిఫికెట్లు, భోజన వసతులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ట్రైన్లో వారు రాజస్థాన్ చేరుకుంటారని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: