అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డి ని పూర్తిగా విస్తరించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటి వరకు కొన్నిచోట్ల మాత్రమే దీని విస్తరణపై ప్రతిపాదనలు ఉండగా, ఇప్పుడు మొత్తం రహదారికి విస్తరణ భాగ్యం కలిగింది. అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారి-44లో మొదలై తాడిపత్రి, కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, గాజులపల్లె, గిద్దలూరు, కంభం, తోకపల్లి, వినుకొండ, నర్సరావుపేట మీదగా గుంటూరు వరకు 417 కి.మీ. మేర 544డి జాతీయ రహదారి ఉంది. ఇందులో గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రెండు వరుసలుగా (14 మీటర్లు వెడల్పుతో) విస్తరణ పనులు జరుగుతున్నాయి. వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు వరుసలుగా విస్తరణకు ఇటీవల ప్రతిపాదన పంపారు. 90 కి.మీ. మేర దీని విస్తరణకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదించడంతోపాటు, మొత్తం 544డి అంతా విస్తరణకు ఆదేశాలు వచ్చాయి.
ట్రాఫిక్ రద్దీ ఆధారంగా..
ఎన్‌హెచ్-544డిలో నాలుగైదు ప్యాకేజీలుగా విభజించి వాటిలో ట్రాఫిక్ రద్దీపై సర్వే జరిపి, దీని ఆధారంగా రెండు, నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే గిద్దలూరు-వినుకొండ మధ్య హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ (హెచ్‌ఏఎం) కింద రెండు వరుసలుగా
విస్తరిస్తున్నారు. గుత్తేదారు సంస్థ 15 ఏళ్లపాటు ఇందులో టోల్ వసూలు చేయనుంది.
ఇదీ చదవండి: