గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంస్థల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. యరపతినేని అనుచరులు, సంస్థల్లో సోదాలు చేసింది. డీఓపీటీ నోటిఫికేషన్ ప్రకారం యరపతినేనిపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టింది. గుంటూరు జిల్లా, హైదరాబాద్‌లో.. ఆయనకు సంబంధించిన 25 చోట్ల సోదాలు చేపట్టింది. లైమ్‌స్టోన్ మైనింగ్ వ్యవహారంలో 17 మందిపై సీబీసీఐడీ గతంలో 17 కేసులు నమోదు చేసింది.
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించింది. 2014-18 మధ్య అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీసీఐడీ కేసులు నమోదు చేసిందని సీబీఐ తెలిపింది. మైనింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్నట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎంత మేర తవ్వకాలు జరిగాయో శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తామన్ని పేర్కొంది.
గురువారం సీబీఐ చేసిన సోదాల్లో పలు విలువైన పత్రాలు, చరవాణులు, ,సుమారు రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్‌పై యరపతినేని సహా మొత్తం 22 మందిపై గతంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఆరుగురు యరపతినేనికి అత్యంత సన్నిహితులని తెలిపింది.
ఇదీ చదవండి : ఎస్ఈసీ... ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదు: మంత్రి వెల్లంపల్లి