ఆగి ఉన్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టిన ఘటన గుంటూరు జిల్లా సత్యనారాయణపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో కొచ్చెర్లకు చెందిన శ్రీ లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. టైరు పంచర్ కావడం వల్ల వేగంగా వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈపూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించి… ప్రాణహాని జరగలేదని నిర్ధారించుకున్నారు. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించామని ఎస్సై సింగయ్య తెలిపారు.
ఇదీ చదవండి :
తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళుతూ..