అమరావతి రైతుల పోరాటం 413వ రోజు కొనసాగింది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, మందడం దీక్షా శిబిరాల వద్దకు రైతులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఏడాదికి పైగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నదాతుల ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని వాపోయారు. పోలీసుల సాయంతో తమ పోరాటాన్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: