ETV Bharat / state

మూడు రాజధానుల ఆమోదంతో గుంటూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన... - గుంటూరులో కొవ్వత్తులతో ప్రదర్శన

రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటాన్ని స్వాగతిస్తూ... వైకాపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ముస్తఫా పాల్గొన్నారు.

candles rally in guntur district for approving three capital system
మూడు రాజధానుల ఆమోదంతో గుంటూరులో కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Aug 4, 2020, 7:28 AM IST

రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటాన్ని స్వాగతిస్తూ... వైకాపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ముస్తఫా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మేరుగ నాగార్జున అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి... అమరావతిని చంద్రబాబు తన వ్యాపారం కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. తాము రాజీనామా చేయాల్సిన పనిలేదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ముస్తఫా అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా... ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

నకిలీ ఔషధాల నియంత్రణకు ప్రత్యేక విభాగం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.