గుంటూరులో కాల్ మనీ ఘటన మళ్లీ కలకలం రేపుతోంది. గుంటూరు, విజయవాడ ప్రాంతాలను గతంలో కుదిపేసిన ఈ తరహా ఉదాంతం, మళ్లీ గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి వడ్డీ వ్యాపారం పేరుతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు ఇటీవల గుంటూరు అర్బన్ ఎస్పీ ఆధ్వర్యంలోని స్పందన కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై అర్బన్ ఎస్పీ విచారణకు ఆదేశించగా కొత్తపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని వద్ద బాధితుల నుంచి తీసుకున్న ప్రామిసరీ నోట్లతోపాటు, ఏటీఎం కార్డులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీచూడండి.బాలిక శవాన్ని తండ్రి తీసుకెళ్లిన రోజు జరిగిందేంటీ?