ETV Bharat / state

పల్లె పోరు: బరిలో అన్నదమ్ములు.. కుర్చీ ఎక్కేదెవరో..!

ఇద్దరూ అన్నదమ్ములు...మొన్నటివరకూ ఒకే పార్టీ..! ఇంతలోనే పంచాయతీ ఎన్నికలు. ఇంకేముంది.. అన్నదమ్ములు ఇద్దరూ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపారు. కానీ ఒక్కరికే పార్టీ మద్దతివ్వటంతో...ఇంకో పార్టీ మద్దతుతో మరొకరు బరిలో నిలిచారు. అంతేనా గెలుపు కోసం ఎవరి వంతుగా వారు తీవ్ర ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తోడబుట్టిన అన్నదమ్ములు.. వేర్వురు పార్టీల నుంచి బరిలో నిలవటంతో పోరు ఆసక్తికరంగా మారింది.

author img

By

Published : Feb 10, 2021, 10:12 AM IST

ap local  polls 2021
ap local polls 2021

బంధాలు.. అనుబంధాలకతీతంగా పల్లెపోరు సాగుతోంది. స్వయంగా అన్నదమ్ములు హోరాహోరీగా తలపడుతున్నారు. వీరికి ప్రధాన రాజకీయపార్టీలు మద్ధతు తెలుపుతుండడం ఆసక్తి రేపుతోంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం మతుకుమల్లి పంచాయతీ ప్రస్తుతం బీసీ జనరల్‌కు కేటాయించారు. గ్రామానికి చెందిన యలగాల సాంబయ్య, యలగాల బసవయ్య అన్నదమ్ములు. నిన్న మొన్నటి వరకు ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి. సర్పంచి పదవిని ఇద్దరూ ఆశించి చెరో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పార్టీ రహితమైనా తమ వారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీల శ్రేణులు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఇద్దరు తెలిసిన వారే కావడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక బంధువులు ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చదవండి: పల్లె పోరు: వెలువడిన ఫలితాలు..సంబరాల్లో గెలిచిన అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.