గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద నిడమర్రు గ్రామానికి చెందిన కిరణ్ బాబు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరణ్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె తల్లితండ్రులు రాజధాని పనుల నిమిత్తం వచ్చి నిడమర్రు గ్రామంలో ఉన్నారు. ఆ యువతితో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పనులు లేకపోవడంతో యువతి కుటుంబం ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయారు. గత రెండు రోజుల క్రితం కిరణ్ యువతికి ఫోన్ చేసి నిడమర్రు వస్తే పెళ్లి చేసుకుందామని ఆమెకి చెప్పాడు. గురువారం రాత్రి యువతి నిడమర్రు గ్రామానికి చేరుకుంది. తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి తండ్రి ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు కిరణ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిడమర్రుకు చేరుకున్న ఆ రాష్ట్ర పోలీసులు కిరణ్, యువతిని అదుపులోకి తీసుకొని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ప్రేయసి కోసం అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుంటుండగా పోలీసులు ఆపారు.
ఇదీ చూడండి. రాష్ట్రానికి బ్రిటన్ సహకారం చాలా అవసరం: సీఎం