ETV Bharat / state

జ్యోతిష్యంలో పదేళ్ల బుడతడి ప్రతిభ.. గౌరవ డాక్టరేట్​ - జ్యోతిష్యంలో డాక్టరేట్

Astrology: జ్యోతిష్యం అనగానే ఊహించుకునేది పదుల వయసు అనుభవం ఉన్నవాళ్లను. కానీ, ఇక్కడ మాత్రం దానికి వ్యతిరేకం. పది సంవత్సరాల వయస్సుకే జ్యోతిష్య శాస్త్రంపై పట్టు సాధించాడు ఓ బుడతడు. జ్యోతిష్య శాస్త్రంలో ఇతని ప్రతిభను మెచ్చి మ్యాజిక్​ బుక్​ ఆఫ్​ రికార్డు సైతం సంస్థ గ్లోబల్​ అవార్డు.. గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది. ఇదేకాక మరెన్నో రికార్డులు ఇతని సొంతమయ్యాయి.

Boy Talent in Astrology
పది సంవత్సరాల బాలుడికి జ్యోతిష్యంలో డాక్టరేట్
author img

By

Published : Oct 27, 2022, 4:22 PM IST

పదేళ్లకే జ్యోతిష్యంలో డాక్టరేట్ సాధించిన యోగానంద శాస్త్రి

Boy Talent in Astrology: పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ పదేళ్లకే ఆ బుడతడు జ్యోతిష్యాన్ని ఔపోసన పట్టాడు. పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతను గుర్తు చేస్తూ.. అతిపిన్న వయస్సులోనే డాక్టరేట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. జ్యోతిష్య శాస్త్రంలో పదుల వయస్సుల వారికి అనుభవం ఉన్న వారికి సాటిగా.. ఈ బుడతడు తన ప్రతిభను చూపిస్తున్నాడు చదువుతో పాటు జ్యోతిష్యంలోనూ పట్టు సాధిస్తున్న గుంటూరు చిన్నోడు యోగానందశాస్త్రిపై ప్రత్యేక కథనం.

చిన్న వయసులో చదువుతోపాటు జ్యోతిష్యంపై పట్టు సాధించాడు ఈ బుడతడు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన అరిపిరాల యోగానంద శాస్త్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ఈ చిన్నోడికి గ్లోబల్ అవార్డుతోపాటు గౌరవ డాక్టరేట్‌ అందించింది. జ్యోతిష్యంలో విధానాలన్నింటినీ ఆకళింపు చేసుకున్న ఈ బుడతడు జ్యోతిష్యశాస్త్రంలో.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ యోగానందశాస్త్రికి డాక్టరేట్ ప్రకటించింది. ఇటీవల దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చిన్నోడు డాక్టరేట్ అందుకున్నాడు.

"మా నాన్ననే నాకు స్పూర్తి. నాకు జ్యోతిష్యంపై ఉన్న అసక్తి గమనించి మా నాన్న నాకు దీనిని నేర్పించాడు. మా నాన్న నేర్పించిన విధానం నాకు మరింత ఆసక్తిని కలిగించింది. నాకు గౌరవ డాక్టరేట్​ లభించినందుకు మా ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు". -యోగానంద శాస్త్రి, జ్యోతిష్యంలో డాక్టరేట్ గ్రహీత

యోగానందశాస్త్రి తండ్రి కల్యాణ శాస్త్రి, తల్లి శ్రీవీణ ఇద్దరూ జ్యోతిష్యంలో డాక్టరేట్ అందుకున్న వారే. వారి ప్రతిభాపాఠవాలను వారసత్వంగా అందిపుచ్చుకుని జ్యోతిష్యంలో దూసుకుపోతున్నాడీ చిన్నోడు. పిన్నవయస్సులోనే యోగానంద ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అతిచిన్న వయసులో ఈ ఘనత అందుకున్నందుకు ఇన్ ప్లూయెన్స్ బుక్ ఆఫ్ రికార్డు, హార్వర్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డుల్లో యోగానంద చోటు దక్కించుకున్నాడు. దేనినైనా అలవోకగా నేర్చుకోవడం అతని ప్రత్యేకత అంటున్నారు తల్లిదండ్రులు. జ్యోతిష్యంలో పరిశోధన చేయడం.. ఐఏఎస్ అధికారి కావడమే.. తన జీవిత లక్ష్యమంటున్నాడు యోగానంద శాస్త్రి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.