Public Opinion on ACCMC: అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై గ్రామసభలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై బోరుపాలెంలో గ్రామసభలో ప్రజల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. 29 గ్రామాలను కలిపి ఉంచాలని కోరారు. విడగొడితే ఒప్పుకునేది లేదని బోరుపాలెం గ్రామస్థులు తేల్చిచెప్పారు. మంగళగిరి కార్పొరేషన్ వేళ గ్రామసభలు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
29 గ్రామాల సంపూర్ణ రాజధానికే తాము అనుకూలమంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం 29 గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత... అన్నింటినీ కలిపే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. సభకు హాజరైన వారందరూ తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: Amaravati Capital City: '19 కాదు.. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'