తూర్పుగోదావరి జిల్లా పడవబోల్తా ఘటనలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన కృష్ణకిషోర్ మృతి చెందాడు. కృష్ణకిషోర్ తన స్నేహితుడు సాయితో కలిసి ఆదివారం ఉదయం పాపికొండల విహారయాత్రకు వెళ్లాడు. కృష్ణకిషోర్ తన తల్లి విజయభారతికి ఫోన్ చేసి పాపికొండలకు వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ప్రమాదం విషయం తెలిసిన దగ్గర్నుంచి కిషోర్ చరవాణి స్వీచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యా కిషోర్ మరణ వార్తను వారికి తెలియజేయలేదు. కిషోర్ మరణ వార్తతో నులకపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి వరకు తమ ముందు తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకపోవడంతో చుట్టుపక్కలవారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇవీ చదవండి