ETV Bharat / state

సీఎం జగన్​కు శంకర్​దాదా బిరుదివ్వాలి: కన్నా

author img

By

Published : Mar 17, 2020, 12:55 PM IST

Updated : Mar 17, 2020, 1:05 PM IST

రాజ్యాంగ వ్యవస్థలను ముఖ్యమంత్రి గౌరవించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సూచించారు. జగన్​ పాలనలో ఎన్నికలు పారదర్శకంగా జరుతాయన్న నమ్మకం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాకు పారసెటమాల్​ వేస్తే తగ్గిపోతుందన్న సీఎం జగన్​కు 'శంకర్​దాదా' బిరుదు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పోలీసులు, ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

సీఎం జగన్​కు శంకర్​దాదా బిరుదివ్వాలి: కన్నా
సీఎం జగన్​కు శంకర్​దాదా బిరుదివ్వాలి: కన్నా

ముఖ్యమంత్రిపై భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

రాజ్యాంగపరంగా ఏర్పడిన అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్​ గౌరవించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బండారు లక్ష్మణ్​ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అన్న విషయం సీఎం గుర్తించాలని అన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ఏ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్లారో.. అదే గౌరవం ఎన్నికల సంఘంపైనా చూపాలన్నారు. ప్రపంచమంతా కరోనాకు భయపడి జాగ్రత్తలు తీసుకుంటే.. సీఎం జగన్​ మాత్రం పారాసెటమాల్​ వేసుకుంటే తగ్గిపోతుందని అనడంపై కన్నా మండిపడ్డారు. జగన్​కు 'శంకర్​దాదా' బిరుదు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. నియంత పాలనలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు యత్నిస్తున్నారని... ఈ విషయాల్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని కన్నా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని దుర్వినియోగం చేయటంపై జాతీయ ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎస్ కు ఎస్​ఈసీ లేఖ

Last Updated : Mar 17, 2020, 1:05 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.