ETV Bharat / state

'మంత్రి హరీశ్​ రావు అబద్ధాలకు కేరాఫ్​ అడ్రస్' - హరీశ్​ రావు వార్తలు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అబద్ధాలకు కేరాఫ్​ అడ్రసని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. దుబ్బాకలో అబద్ధాలు చెప్పినందుకే హరీశ్​ రావుకు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.

bandi sanjay fire on harish
మంత్రి హరీష్ పై భాజపా నేత విమర్శలు
author img

By

Published : Mar 26, 2021, 7:57 PM IST

శాసనసభలో లేని వ్యక్తిపై విమర్శలు చేయకూడదని సీనియర్​గా చెప్పుకుంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావుకు తెలియదా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అబద్ధాలకు కేరాఫ్​ అడ్రస్​ అని విమర్శించారు. దుబ్బాకలో అబద్ధాలు చెప్పినందుకే హరీశ్​ రావుకు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టుల పేరుతో తెరాస భారీగా అవినీతికి పాల్పడింది..

ప్రాజెక్టుల పేరుతో తెరాస ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజక్టులను అడ్డుకోవాలని మాత్రమే తాను కేంద్రానికి లేఖ రాశానని బండి సంజయ్​ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పార్లమెంట్​ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలనని చెప్పారు. లోక్​సభ స్పీకర్ కొవిడ్ నుంచి కోలుకున్న వెంటనే కేసీఆర్​పై ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్ పార్లమెంట్​ను తప్పుదోవ పట్టించిన విషయం బయటకు వచ్చాక సంచలనం అవుతుందన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.