జగన్ వంద రోజుల పాలనపై భారతీయ జనతా యువ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు రమేష్ నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో పార్టీ నేత లంక దినకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్‌మోహాన్ రెడ్డి పాలన పారదర్శకంగా ఉంటుందని భాజపా ఆశించిందని,అందుకు భిన్నంగా రాష్ర్టంలో పంచాయతీల పాలన కొనసాగుతుందని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ర్టంలో మత మార్పిడిలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ప్రజలకు రక్షణగా ఉంటానన్న జగన్, ఇప్పుడు శిక్షగా మారాడని లంక దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి.'100 రోజుల్లో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై తెదేపా పుస్తకం'