గుంటూరులో రమ్య కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రమ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసేందుకు భాజపా మహిళా మోర్చా నాయకులు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు.
భాజపా మహిళా నాయకులను రమ్య ఇంటి వైపు వెళ్లనివ్వలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా నేత సాదినేని యామిని.. కమిషన్‌ను కలిస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో రమ్య ఇంటివద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: Ramya Murder case: గుంటూరుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం