తితిదే ఆస్తుల అమ్మకం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని... రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకురాలు సాధినేని యామిని విమర్శించారు. ఈ విషయంపై గుంటూరులో జరిగిన దీక్షలో పాల్గొన్న ఆమె ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాడు వైయస్ ఏడుకొండలు కాదు రెండు కొండలు అని మాట్లాడారనీ... ఇపుడు జగన్ ప్రభుత్వంలో తితిదే భూములు అమ్మడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అనే మాటలను నిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. హిందూ ఆలయాల జోలికి, హిందూ ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తితిదే భూముల అమ్మకం జీవో వెనక్కు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: