గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో 74వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా కేంద్ర ఉద్యానవన శాఖ బోర్డ్ ఎండీ ఎం.ఆరిజ్ అహ్మద్ హాజరయ్యారు. కళాశాలలోని వ్యవసాయ నిపుణులు విద్యార్థులతో వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని వ్యవసాయంలో ఉన్న శాఖలన్నీ వ్యవసాయ ఉత్పత్తుల కోసం పనిచేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ లోకనాథ్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీచదవండి