ETV Bharat / state

'వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతిచెందాడు' - crime news in sattenapalli

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదం జరిగింది. కాన్పు కోసం వెళ్లిన ఓ గర్భిణీని... రేపు, మాపు అంటూ వెనక్కు పంపించగా కాన్పు కష్టమయ్యింది. అనంతరం గుంటూరు జీజీహెచ్​కి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు.

సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రి ఆందోళన చేపట్టిన బాధితులు

author img

By

Published : May 6, 2020, 11:39 PM IST

కడుపులో ఉన్న బిడ్డ మరణానికి వైద్యురాలు కారణం అంటూ... సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. క్రోసూరు మండలం త్యాళ్లూరుకు చెందిన జయశ్రీ 9వ నెల వచ్చిన తర్వాత సత్తెనపల్లి ఆసుపత్రికి కాన్పు కోసం వెళ్లింది. అక్కడ పని చేసే వైద్యురాలు గత 15 రోజుల నుంచి రేపు, మాపు అంటూ వెనక్కు పంపించింది. ఈనెల 4న మరోసారి ఆసుపత్రికి వెళ్లగా... కాన్పు కష్టమని గుంటూరుకు తీసుకెళ్లాలని సుచించారు.

జయశ్రీని ఆమె కుటుంబసభ్యులు 5న గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్​ చేసి శిశువును బయటకి తీశారు. అయితే బాబు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే తల్లి కడుపులోనే బాబు మరణించాడని ఆరోపిస్తూ.. బాధిత కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్ద శిశువు మృతదేహంతో ధర్నా చేపట్టారు.

ఇదీ చూడండి: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..తోటలోనే ప్రసవించిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.