ETV Bharat / state

ప్రతి ఆడపిల్ల.. ఆడపులిగా మారాలి: హోంమంత్రి సుచరిత - awareness on disha app

ప్రతి ఆడపిల్ల ఒక అడపులిగా మారి.. సమస్యను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని హోంమంత్రి సుచరిత అన్నారు. దిశ చట్టంపై గుంటూరు జిల్లాలో వైకాపా నేతలు విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన సదస్సులో హోంమంత్రి పాల్గొన్నారు. దిశ చట్టం చిన్నారులకు, మహిళలకు గొప్ప వరమని తెలిపారు.

awareness programme on disha app to students in guntur district
దిశ చట్టంపై విద్యార్థినులకు అవగాహన సదస్సు
author img

By

Published : Dec 14, 2020, 7:48 PM IST

దిశ చట్టం పనితీరు.. దిశ చట్టాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై గుంటూరులో వైకాపా నేతలు విద్యార్ధినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దిశ చట్టాన్ని ప్రజలలో తీసుకువెళ్లడానికి మాస్క్​లపై దిశ యాప్, దిశ టోల్ ఫ్రీ నెంబర్​లను ముద్రించి విద్యార్ధినులకు అందచేశారు. దిశ చట్టం చిన్నారులకు, మహిళలకు గొప్ప వరమని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతి ఆడపిల్ల ఒక అడపులిగా మారి.. సమస్యను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలన్నారు.

తల్లిదండ్రులు.. పిల్లలను చిన్న వయసు నుంచి సరైన మార్గంలో పెంచాలని సూచించారు. దిశ చట్టాలతో పాటు స్వీయ రక్షణ కూడా చాలా ముఖ్యమని హోంమంత్రి తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా విద్యను సాగిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. మహిళలు, విద్యార్థినుల కోసం.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సుచరిత సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.