ETV Bharat / state

కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంటూరులో ఆంక్షలు

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు తగు చర్యలు చేపట్టారు. దుకాణాల పనివేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార కార్యకలపాలకు అనుమతినిచ్చారు.

author img

By

Published : Apr 22, 2021, 9:22 PM IST

గుంటూరులో మూసేసిన దుకాణాలు
గుంటూరులో మూసేసిన దుకాణాలు

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో జన సంచారంపై ఆంక్షలు మెుదలయ్యాయి. వైరస్​ని కట్టడి చేసే క్రమంలో బయటి ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నేటి నుంచి దుకాణాల పనివేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా ఇప్పటికే తమ సమ్మతిని తెలియజేసింది. దీంతో 6 గంటల తర్వాత పోలీసులు వాహనాల్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ దుకాణాలు మూసివేయాలని మైకుల ద్వారా ప్రకటిస్తున్నారు. జిల్లాలో నమోదయ్యే కేసుల్లో 50 నుంచి 60 శాతం గుంటూరులోనే ఉన్నాయి. మందుల దుకాణాలు, ఆసుపత్రులు, ల్యాబులు, పెట్రోల్ బంకులు, పాల బూత్​లకు మినహయింపునిచ్చారు.

ఇదీ చదవండి:

పేకాట స్థావరంపై దాడులు... పదిహేను మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.