ETV Bharat / state

జగన్‌ పాలనలో రక్షక భటులకే రక్షణ కరవు- పోలీసులపై జులుం ప్రదర్శిస్తున్న వైఎస్సార్​సీపీ నాయకులు

Attacks on Police Under YCP Government: ఎక్కడైనా పోలీసులను చూసి నేరగాళ్లు, అసాంఘిక శక్తులు భయపడతాయి. ఖాకీ డ్రెస్‌కి గౌరవమిస్తారు కానీ జగనన్న పాలనలో రాష్ట్రంలో సీన్‌ రివర్స్‌లో నడుస్తోంది. అధికారానికి అరాచకం తోడవటంతో వైఎస్సార్​సీపీ నాయకుల్ని చూసి పోలీసులే బిక్కుబిక్కుమంటున్నారు. స్టేషన్లపై, పోలీసులపై దాడులు సాధారణమైపోయాయి. ఎదురుతిరిగితే బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయటం లేదా పోలీసులపైనే ఎదురు కేసులు పెట్టడం ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని ఖాకీల దయనీయ స్థితి!

attacks_on_police
attacks_on_police
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 9:56 AM IST

జగన్‌ పాలనలో రక్షక భటులకే రక్షణ కరవు- పోలీసులపై జులుం ప్రదర్శిస్తున్న వైసీపీ నాయకులు

Attacks on Police Under YCP Government: పోలీసులను చూసి నేరగాళ్లు సహా ఎవరైనా భయపడతారు. కానీ జగన్‌ పాలనలో అధికార పార్టీ నాయకుల్ని చూసి పోలీసులే హడలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. పోలీసు స్టేషన్లపైనే కాదు పోలీసు అధికారులపైనా దాడులు, ముష్ఠిఘాతాలు సర్వసాధారణమైపోయాయి. మెజార్టీ సందర్భాల్లో అసలు కేసే నమోదు చేయట్లేదు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే నామమాత్ర సెక్షన్లతో సరిపెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. ఫిర్యాదుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి వారంతట వారే కేసు వెనక్కి తీసుకొనేలా బెదిరిస్తారు. అయినా లొంగకపోతే బాధితులపైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారు. పోలీసులే రక్షించండని చేతులెత్తి మొక్కుకుంటున్నా ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, చివరకు పోలీసుల సంఘమూ పట్టించుకోని దుస్థితి దాపురించింది.

YCP Leaders Attacks on Police: ‘పోలీసులైతే మాకేంటి?’ అంటూ మేం చెప్పిందే వేదమంటూ అడ్డొస్తే అంతు చూస్తామంటూ వైఎస్సార్​సీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్​సీపీ నాయకులే కాదు చివరికి వారి వద్ద పనిచేసే సిబ్బందీ రక్షక భటులపై దాడులకు తెగబడుతున్నారు. వాతలు తేలేలా తలలు పగిలేలా హింసిస్తూ రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్‌ నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. మాటవరసకైనా వారి పక్షనా మాట్లాడటం లేదు. ఇక హోంమంత్రి, డీజీపీ అయితే సరేసరి. ఒక్కరంటే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పోలీసులకే భద్రత ఇవ్వలేని ఉన్నతాధికారులు ఇక సామాన్యులను ఏం కాపాడతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్న అరాచకాలను ప్రతిపక్ష నాయకులు తప్పు పట్టడమే తరువాయి వారిపైన ఒంటికాలితో విరుచుకుపడుతూ రాజకీయపరమైన విమర్శలు చేసే పోలీసు అధికారుల సంఘం వైసీపీ నాయకుల అరాచకాలపై మాత్రం అస్సలు నోరెత్తడం లేదు. కనీసం ఖండించిన పాపాన పోలేదు.

'ముఖ్యమంత్రి ఇలాకాలో పోలీసులపై వైఎస్సార్​సీపీ దాడులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పట్టించుకోని అధికారులు'

Kadapa District: కడపలో నిఘా విభాగం ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ వీపుపై వాతలు తేలేలా వైఎస్సార్​సీపీ మూకలు దాడి చేసిన ఘటనలో బాధితుడిపైనే రివర్స్‌ కేసు పెట్టారు. దాడి చేసిన వారితో రాజీపడాలని, లేదంటే మీరే ఇబ్బంది పడతారంటూ నేరుగా పోలీసు ఉన్నతాధికారులే ఇన్‌స్పెక్టర్‌ కుటుంబ సభ్యులను హెచ్చరించారు. వారు వెనక్కి తగ్గకపోవటంతో బాధితులపైనే రివర్స్‌ కేసు పెట్టారు.

Anantapur District: అనంతపురం వైఎస్సార్​సీపీ కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్, మరికొందరితో కలిసి గత ఆగస్టులో అనంతపురం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌పైకి దండెత్తారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్, ఎస్సైపై దాడికి పాల్పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టినా ఆ తర్వాత తేలికపాటి సెక్షన్లతో మమ అనిపించారు. దాడికి పాల్పడ్డ కార్పొరేటర్‌ను అసలు నిందితుడిగానే చేర్చలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్‌ను, ఆమె భర్తను బెదిరించి 24 గంటల్లోగా ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారు.

Palnadu District: పల్నాడు జిల్లా ముప్పాళ్ల పోలీసుస్టేషన్‌ను రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసుల అదుపులో ఉన్న యువకుల్ని తమకు అప్పగించాలంటూ ఎస్సైతో వాదనకు దిగారు. ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అయినా సరే ఆ దాడిచేసిన వారెవరిపైనా ఏ చర్యా తీసుకోలేదు ఓ మంత్రి ఒత్తిడితో వారినీ వదిలేశారు.

Anantapur Range DIG Ammi Reddy: పుంగనూరు ఘటనలో అల్లరిమూకను విడిచిపెట్టేది లేదు: డీఐజీ అమ్మిరెడ్డి

Tirupati District: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు, వైఎస్సార్​సీపీ నాయకుడైన కళత్తూరు సునీల్‌రెడ్డిపై రౌడీషీట్‌ ఉందని అతడ్ని కౌన్సిలింగ్‌కు పిలిపించటమే పాపమైంది. పోలీసుస్టేషన్‌లో వీరంగం సృష్టించిన సునీల్‌రెడ్డి దళిత ఎస్సై రవిబాబుపై దాడికి పాల్పడ్డాడు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Prakasam District: ప్రకాశం జిల్లా సింగరాయకొండ సెబ్‌ ఎస్సై దయాకర్‌పై వైఎస్సార్​సీపీ నాయకుడు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు అరుణ భర్త యన్నాబత్తిన వెంకటేశ్వరరావు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సెబ్‌ స్టేషన్‌ ముందే కుర్చీలో కూర్చొని ఎస్సైపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదిస్తే అంతు తేలుస్తామని హెచ్చరించారు. అయినా ఈ ఘటనపై ఎలాంటి కేసూ లేదు.

Krishna District: ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవటానికి ప్రయత్నించిన పోలీసుల రక్తాన్ని వైఎస్సార్​సీపీ నాయకులు కళ్లజూస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం జువ్వపాలెం చెరువులో సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లిన కానిస్టేబుల్‌ బాలకృష్ణపై వైఎస్సార్​సీపీ నాయకులు కర్రతో దాడి చేశారు. ఆయన తలపగలగొట్టి రక్తం కళ్లజూశారు.

YSRCP Leaders ruckus on Excise Police: సెబ్​ స్టేషన్​లో వైసీపీ నాయకుడి వీరంగం..

Guntur District: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల గ్రామ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై కోటేశ్వరరావును వైఎస్సార్​సీపీ నాయకులు అడ్డుకున్నారు. సినిమాల్లో మాదిరి ట్రాక్టర్లతో చుట్టుముట్టి ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితుడైన ఎస్సైనే ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు.

Kurnool District: కర్నూలు జిల్లా కోడమూరు మండలం గోరంట్లలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు తనిఖీలకు వెళ్లిన ఎస్సై వేణుగోపాల్‌పై వైఎస్సార్​సీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు.

Amaravati: రాజధాని ప్రాంతంలో అర్ధరాత్రి ఇసుక లారీని ఆపినందుకు సెబ్‌ పోలీసులపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. అమరావతికి చెందిన వైఎస్సార్​సీపీ నాయకుడు ఆళ్ల లక్ష్మీనారాయణకు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకోగా ఆయన స్టేషన్‌ మీదకు దండెత్తి వీరంగం సృష్టించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.