Attack on TDP activist: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెనుమూలికి చెందిన తెదేపా కార్యకర్త ఆనంద్‌బాబుపై కత్తులతో హత్యాయత్నం జరిగింది. గ్రామ సర్పంచి భర్త కొరటాల సురేశ్ తన అనుచరులతో దాడికి యత్నించాడని ఆనంద్‌బాబు తెలిపారు. గతంలో గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహించే క్రమంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో తాను వాలంటీర్ పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరానని ఆనంద్‌బాబు వివరించారు. దీంతో కక్షపెంచుకున్న సురేశ్.. తనపై దుర్భాషలాడి, కత్తులతో దాడికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణాపాయం ఉందని.. పోలీసులు రక్షించాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Women death: పాపం పసివాడు.. నాలుగు రోజులుగా అమ్మ మృతదేహంతోనే..!