ETV Bharat / state

​Atal Bihari Vajpayee Death Anniversary: మాజీ ప్రధానమంత్రి వాజ్​పేయీకి పలువురి నివాళి

​Atal Bihari Vajpayee Death Anniversary: మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయీ వర్ధంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Political_Leaders_Tribute_to_Atal_Bihari_Vajpayee

author img

By

Published : Aug 16, 2023, 2:15 PM IST

Updated : Aug 16, 2023, 3:14 PM IST

AP BJP Chief Purandeswari Tribute to Atal Bihari: నిజమైన రాజనీతిజ్ఞుడు, ప్రజాకర్షణ గల వక్త, దార్శనికత కలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయీ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయీ నాయకత్వం రాజకీయ రంగాన్ని రూపొందించడమే కాకుండా భారతదేశ పురోగతి, అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. అతని రాజనీతిజ్ఞత, పార్టీ శ్రేణుల మధ్య ఏకాభిప్రాయాన్ని నిర్మించగల సామర్థ్యం ఆదర్శప్రాయమైనవి, ఐక్యత, సామరస్య భావాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.

  • Tributes to a true statesman, a charismatic orator, and a visionary leader, Shri Atal Bihari Vajpayee Ji, on his punyatithi today. Vajpayee Ji's leadership not only shaped the political landscape but also left an indelible mark on India's progress and development. His… pic.twitter.com/gNNkHEVZ5W

    — N Chandrababu Naidu (@ncbn) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెరపైకి వాజ్‌పేయీ బయోపిక్‌.. టైటిల్​ రోల్​లో ఆ స్టార్ హీరో

​Atal Bihari Vajpayee Death Anniversary: సంపూర్ణంగా దేశసేవకే అంకితమైన మహనీయుడు.. అటల్ బిహారీ వాజ్‌పేయీ అని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు.. పురందేశ్వరి అన్నారు. వాజ్‌పేయీ వర్ధంతి(Atal Bihari Vajpayee Death Anniversary) సందర్భంగా.. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పురందేశ్వరి నివాళులు అర్పించారు. భౌతికంగా లేకపోయినా ఆయన విశిష్ట సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశంలో సుపరిపాలనకు నిదర్శనంగా వాజ్‌పేయీ నిలిచారని కొనియాడారు. చాలా పిన్న వయస్సులోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. వాజ్‌పేయీ పోరాటపటిమను.. యువత అందిపుచ్చుకుని.. స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.

  • Paying heartfelt homage to the incredible Atal Ji on his Punya Tithi, as a proud Indian among 1.4 billion. His remarkable leadership propelled India's progress across diverse sectors, ushering our nation into the 21st century. #RememberingAtalBihariVajpayee pic.twitter.com/Fnf2ZhdSjg

    — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు

Janasena Chief Pawan Kalyan Tributes to Vajpayee: దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో అని.. అటువంటి వారిలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్​పేయీని ప్రముఖంగా చెప్పుకోవచ్చని జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందల, వేల కోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో.. మూడు సార్లు భారతదేశానికి ప్రధాన మంత్రిగా పని చేసినప్పటికీ చివరి రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్​పేయీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. ఆయన భారతరత్నగా మనందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవిచూసిన వాజ్​పేయీ.. దేశమే జీవితం అనుకొని బ్రహ్మచారిగానే మిగిలిపోయారన్నారు. హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన.. పాత్రికేయునిగా పని చేస్తూనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారని పవన్​ తెలిపారు.

'వాజ్​పేయీ​ సృష్టించిన రాష్ట్రానికి మోదీ రాకతో అభివృద్ధి కళ'

Pawan Kalyan Comments on Atal Bihari: అటల్​ నిర్వర్తించిన పదవులు ఎన్నో అని పవన్​ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తన ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. పార్లమెంటేరియన్​గా ఆయన సుదీర్ఘంగా పని చేశారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా ఆయన హయాంలో మన దేశం ఎన్నో విజయాలను చవిచూసిందని స్పష్టం చేశారు. రాజస్థాన్ ఎడారిలో అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే అన్నారు. ప్రైవేటు రంగాన్ని పటిష్ఠపరచటం, దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు రవాణా వ్యవస్థను విస్తరించటం ఆయన సాధించిన విజయాలే అని గుర్తు చేశారు. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్దాటి పార్లమెంటును అబ్బురపరిచేదని.. పవన్​ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన వర్ధంతి సందర్భంగా తన తరఫున, జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

వాజ్​పేయీ బర్త్​డే స్పెషల్​.. 'మై అటల్​ హూ' ఫస్ట్​లుక్​ రిలీజ్

Last Updated : Aug 16, 2023, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.