ETV Bharat / state

కరోనాతో ఏఎన్​యూ అసోసియేట్ ప్రొఫెసర్ మృతి - associate professor raghuram, department of botany

రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య అధికమవుతోంది. తాజాగా.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బోటనీ, మైక్రో బయాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ రఘురామ్​కు కరోనా సోకింది. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మరణించారు.

death
death
author img

By

Published : May 8, 2021, 7:23 PM IST

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. కరోనా సోకి ప్రొఫెసర్ మృతి చెందారు. బోటనీ, మైక్రో బయాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న రఘురామ్​కు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన ప్రాణాలు కోల్పోయారు. రఘురామ్​కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 2006లో సహాయాచార్యులుగా ఏఎన్​యూలో చేరారు. 2018లో అసోసియేట్ ప్రొఫెసర్​గా ఉద్యోగోన్నతి సాధించారు. గతనెల వారణాసి వెళ్లిన ఆయన కరోనా బారిన పడ్డారు. విశ్వవిద్యాలయంలో కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.

ఇదీ చదవండి:

భార్యకు కరోనా... మనస్థాపంతో భర్త ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.