ETV Bharat / state

'నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి'

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్​ చేశారు. సాగు చట్టాలపై రాష్ట్రంలో అధికార, విపక్షాలు ఎటువైపు నిలుస్తాయో స్పష్టం చేయాలని అన్నారు.

nirasanalu
నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
author img

By

Published : Dec 27, 2020, 4:16 PM IST

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి పక్షమో తేల్చుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. నల్ల చట్టాలు వ్యవసాయానికి గొడ్డలిపెట్టుగా ఉన్నాయని.. తక్షణమే కేంద్రం వీటిని ఉపసంహరించుకోవాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో డిమాండ్​ చేశారు.

ప్రధాని నల్ల చట్టాలను రద్దు చేయకపోగా తన తాబేదార్లతో చట్టాలపై సదస్సులు పెట్టడం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమంటూ దుయ్యబట్టారు. భారత ఆహార విధానాన్ని దెబ్బతీసేలా కొత్త సాగు చట్టాలు ఉన్నాయని.. వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీ వేదికగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నుంచి రైతు సంఘాల నాయకులు తరలి వెళ్లినట్టు తెలిపారు.

ఇదీ చదవండి: అపోలో ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.