ETV Bharat / state

Asset value increase: ఆస్తుల విలువ పెంపు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు

author img

By

Published : Feb 4, 2022, 5:28 AM IST

Asset value increase: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్‌ నుంచి ఆస్తుల కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి రానున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రకటన దరిమిలా కొన్నిచోట్ల భూముల ధరలు పెరిగాయి. తదనుగుణంగా మార్కెట్‌ విలువలూ సవరించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Asset value increase
Asset value increase

Asset value increase: రాష్ట్రంలో ఆస్తుల మార్కెట్‌ విలువల పెరుగనుంది. జిల్లాల పునర్విభజన ప్రకటనతో కొన్నిచోట్ల భూముల ధరలు పెరగడంతో... తదనుగుణంగా మార్కెట్‌ విలువలూ సవరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆస్తుల విలువ హెచ్చింపును బట్టి కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీల భారం పడనుంది. నగరాలు, పట్టణాలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతాల్లో ఏటా ఆగస్టులో, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి మార్కెట్‌ విలువలు సవరిస్తున్నారు. కిందటేడాది ఆగస్టు నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలను గ్రిడ్స్‌గా విభజించి కొత్త మార్కెట్‌ విలువలు ఖరారు చేసేలా కసరత్తు జరిగింది. అయితే కొవిడ్‌ ప్రభావం, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు 2021 జులై 9న ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే అమల్లో ఉన్న మార్కెట్‌ విలువలే 2022 మార్చి 31 వరకు కొనసాగుతాయని పేర్కొంది. తాజాగా గ్రామాల్లో 2022 ఏప్రిల్‌ 1 నుంచి సవరించే మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చేలా జిల్లా అధికారులు కమిటీల ద్వారా ఖరారు చేయాలని గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

నరసరావుపేట, బాపట్లలో ఇప్పటికే హెచ్చింపు...

ఆస్తుల విలువ సవరణకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు 2022 ఏప్రిల్‌ 1 కాగా, గుంటూరు జిల్లా బాపట్ల, నరసరావుపేట పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఫిబ్రవరి 1 నుంచే కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. ఈ పట్టణాలను ప్రభుత్వం ఇటీవల జిల్లాలుగా ప్రకటించింది. వీటికి సమీపంలోని సుమారు 20 గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించి, అక్కడ ఆస్తుల విలువ పెంచేసింది. నరసరావుపేట శివారు గ్రామాల్లో పెంపు 100 శాతంగా ఉంది. బాపట్ల పట్టణంలోని ఈస్ట్‌ బాపట్ల, వెస్ట్‌ బాపట్ల, అడవి, అప్పికట్ల, మరుప్రోలువారిపాలెం, ఈతేరు, మురుకొండపాడు, గణపవరం, కర్రపాలెంలో మార్కెట్‌ విలువ పెంచారు. పట్టణంలో గజం భూమి విలువ రూ.2,100 నుంచి రూ.3,000కు సవరించారు. కొన్నిచోట్ల ఎకరా రూ.5.25 లక్షలు ఉంటే రూ.7 లక్షలకు పెంచారు. తెనాలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోనూ కొంతవరకు సవరించారు.

నరసరావుపేట పట్టణ సమీపంలోని రావిపాడు మినహా మిగిలిన గ్రామాల్లో వ్యవసాయేతర భూముల విలువ పెరిగింది. గజం రూ.1,800 నుంచి రూ.3వేలకు పెంచారు. రావిపాడులో ఏకంగా రూ.5 వేలుగా నిర్ణయించారు. ఆస్తుల విలువ సవరణ వల్ల కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపేణా ఎకరాకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు భారం పెరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై శాఖల వారీగా సమీక్షిస్తోంది. మార్కెట్‌ విలువ తక్కువగా ఉండి, దస్తావేజుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించి బాపట్ల, నరసరావుపేటల్లో ముందే పెంచినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Power Cut: రాష్ట్రంలో పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.