ETV Bharat / state

గ్రామ వాలంటీర్ల నియామకంపై హైకోర్టులో వాదనలు - highcourt

గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో అసంపూర్తిగా ఉందంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. దీనిని కొట్టి వేయాలంటూ హైకోర్టును ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.

గ్రామవాలంటీర్లు
author img

By

Published : Jul 30, 2019, 3:34 AM IST

గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వాజ్యంపై సోమవారం వాదనలు ముగిశాయి . ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తన ఉత్తర్వులు ఇచ్చేందుకు విచారణను వాయిదా వేసింది. గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తూ పంచాయతీరాజ్ జూన్ 22న జారీ చేసిన జీవో 104ను సవాలు చేస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... గ్రామ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, జీవో లోపభూయిష్టంగా ఉందన్నారు. వాలంటీర్ల బాధ్యతల గురించి ప్రస్తావన లేదన్నారు. వారిని పూర్తిస్థాయి విధులా ? స్వల్పకాలిక విధులు నిర్వహించాలో పేర్కొనలేదన్నారు . ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నప్పుడు వాలంటీర్లు నిర్వహించే బాధ్యతలేముంటాయన్నారు. ఖాళీలు ఏర్పడితే ఎవరు భర్తీ చేస్తారు? ఇంటింటికి తిరిగినందుకు రవాణా ఖర్చులు ఎవరు చెల్లిస్తారు? తదితర అంశాల గురించి జీవోలో పేర్కొనలేదన్నారు . గౌరవ వేతనం స్థానంలో జీతం చెల్లించాలన్నారు. కేవలం మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేయడం సరికాదన్నారు . జీవో అమలును నిలుపుదల చేయాలన్నారు.

ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్ .శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ జీవో 104ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల నిరాకరించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎంపిక కమిటీ ఖాళీలను భర్తీ చేస్తుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. సంబంధిత పంచాయతీలకు నిధులు కేటాయిస్తుందని, ఆ నిధుల నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తారన్నారు . ఇప్పటికే 16వేల 400లకు పైగా వాలంటీర్లను నియమించామన్నారు. గ్రామ పరిపాలన కోసం గ్రామ సహాయక్ పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే ప్రక్రియలో రాజస్థాన్ హైకోర్టు జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. ఎంపిక విధానంలో అన్యాయానికి గురైన బాధిత అభ్యర్థి కోర్టును ఆశ్రయించ వచ్చన్నారు . మొత్తం ప్రక్రియను సవాలు చేస్తూ పిల్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు . వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు.

Intro:Ap_Nlr_01_28_Ntr_Jayanthi_Kiran_Av_C1

దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మూలాపేట, నర్తకి సెంటర్ లలోని ఎన్టీఆర్ విగ్రహాలకు తెదేపా నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెదేపా నేతలు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి, రమేష్ రెడ్డిలు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా తెలుగు ప్రజల అభ్యున్నతికి తాము ఎప్పుడూ కృషి చేస్తామని వారు వెల్లడించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.