ETV Bharat / state

కొండగట్టును సందర్శించిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌.. అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - వాస్తుశిల్పి ఆనంద్​సాయి తాజా వార్తలు

Architecture Anand Sai visited Kondagattu: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు దేవస్థానాన్ని ప్రముఖ వాస్తు శిల్పి ఆనంద్​సాయి సందర్శించారు. ఈ నెల 14న తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొండగట్టుకు రానుండగా ఆనంద్‌సాయి ఆదివారం వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆగమశాస్త్రం ప్రకారం కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయడంతో పాటు భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అధికారులు, అర్చకులతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

Kondagattu temple
కొండగట్టు దేవస్థానం
author img

By

Published : Feb 13, 2023, 12:21 PM IST

Architecture Anand Sai visited Kondagattu: ఆగమశాస్త్రం ప్రకారం కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయడంతో పాటు భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అధికారులు, అర్చకులతో చర్చించినట్లు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని యాదాద్రి పుణ్యక్షేత్రం తరహాలో అభివృద్ధి చేయడానికి ఇటీవల ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

యాదాద్రి ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టిన వాస్తు శిల్పి ఆనంద్​సాయి కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 14న తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొండగట్టుకు రానుండగా.. ఆనంద్‌సాయి ఆదివారం వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయానికి రెండో ప్రాకార మండపం, పుష్కరిణి, విద్యుత్తు, గదులు, నీటి వసతి, మెట్ల దారి వెంట భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

కొండపైన ఉన్న చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. దూరం నుంచి భక్తులకు కనిపించేలా ఆలయ పరిసరాల్లో స్థలం ఎంపిక చేసి 108 అడుగుల ఎత్తుతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తామని తెలిపారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టరు యాస్మిన్‌బాషా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.