ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా కోస్తా ప్రాంతాల్లో కొనసాగుతుండగా.. రాగల 2-3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజుల్లో రాష్టంలో వర్షాలు పడే సూచన ఉన్నట్లు వివరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్రలో..
నేడు దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రాయలసీమలో..
నేడు ఉరుములు మెరుపులతో రాయలసీమలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'ఎస్సీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.. డీజీపీ గారూ సమీక్షించండి'