ETV Bharat / state

కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల

Constable Prelims result: కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పోలీసు వెబ్‌సైట్‌లో ఫలితాల వివరాలు పొందుపరించారు. కానిస్టేబుల్‌ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరవ్వగా.. 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈనెల 7 వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించారు.

result
ఫలితాలు
author img

By

Published : Feb 5, 2023, 3:59 PM IST

Updated : Feb 6, 2023, 6:37 AM IST

Constable Prelims result: రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గత నెల 22న ప్రాథమిక పరీక్ష రాసిన 4,59,182 మంది అభ్యర్థుల్లో 95,209 మంది (20.73%) ఉత్తీర్ణులయ్యారు. పోలీసు నియామక మండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల ఆధారంగా ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ పడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. వీరు స్టేజ్‌-2 పరీక్షల కోసం ఈ నెల 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని తెలిపింది.

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది, 95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు. సమాధానాల ‘కీ’కి సంబంధించి మొత్తం 2,261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో మూడు ప్రశ్నల సమాధానాలను ‘కీ’లో మార్చినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. సందేహాలు ఉంటే 94414 50639, 91002 03323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఎట్టకేలకు ఒక నోటిఫికేషన్‌ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం కటాఫ్‌ మార్కులు ఎక్కువగా పెట్టటంతో రాత పరీక్షలో లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్దిఖీ ఆరోపించారు. తక్షణమే కటాఫ్‌ మార్కులను తగ్గించాలని డిమాండు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 6, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.