ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
ఏప్రిల్ 10, 2020 రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగించి... కనకరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయమూర్తి తాండవ గణేష్‌తో సహా మరో 13మంది న్యాయమూర్తులు పిల్ 89 ఆఫ్ 2020 ని వేశారు.
ఆర్టికల్ 213 ప్రకారం ఈ ప్రస్తుత పరిస్థితులలో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని... ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో 617, 618, 619లు కూడా చెల్లవని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిగా పూర్తి కాలం పదవిలో కొనసాగేందుకు రమేష్ కుమార్‌కు తిరిగి అవకాశం ఇవ్వటం చాలా హర్షణీయమని న్యాయవాది తాండవ గణేష్ అన్నారు.
ఇదీ చదవండి: