AP High Court On Atrocity cases On Amaravathi SC Farmers: ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు నమోదు చేయడం, రిమాండ్ విధించటంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులు, న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇది నేపథ్యం..
2020 అక్టోబరులో మూడు రాజధానుల ఉద్యమం కోసం ఆటోల్లో వెళ్తున్న కొందరు రైతులను మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మద్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి 11 మంది రైతుల్ని అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టులో వారిని ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అనంతరం రైతులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. వారు జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ కేసు ఇవాళ విచారణకు రాగా.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినప్పుడు.. న్యాయమూర్తులు కూడా యాంత్రికంగా వారికి రిమాండ్ విధించడం సరికాదని వెల్లడించింది. మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్‌తో పాటు మంగళగిరి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ వీవీఎన్‌వీ. లక్ష్మీ, బెయిల్ మంజూరు చేయని గుంటూరు అదనపు జిల్లా జడ్జి ఎ. వాసంతిలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి