ETV Bharat / state

మరోసారి నోటీసులు జారీ చేస్తామన్న సీఐడీ.. విచారణ 4 వారాలకు వాయిదా - ca lawsuits adjourned for four weeks

HC ON CID NOTICES TO AUDITORS: సీఏ శ్రావణ్​ అరెస్టుపై మాట్లాడినందుకు సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు ఛార్టెర్డ్​ అకౌంటెంట్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పలు ఆదేశాలు జారీ చేసింది.

HC ON CID NOTICES TO AUDITORS
HC ON CID NOTICES TO AUDITORS
author img

By

Published : Apr 19, 2023, 8:17 AM IST

HC ON CID NOTICES TO AUDITORS: ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) శ్రావణ్‌ అరెస్ట్‌పై ఏపీ ప్రొఫెషనల్స్‌ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 2న నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడినందుకు సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు ఛార్టెర్డ్‌ అకౌంటెంట్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్లు పీవీ మల్లికార్జునరావు, ముప్పాళ్ల సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున న్యాయవాది శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఐడీ నోటీసులో పేర్కొన్న తేదీల కాల పరిమితి ముగిసినందున మరోసారి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ తేదీల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో అనుబంధ పిటిషన్‌ నిరర్థకం అవుతుందన్నారు. దానిపై విచారణను మూసివేయాలని కోరారు. సీఐడీ జారీచేసిన నోటీసు చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రధాన అభ్యర్థన చేసిన నేపథ్యంలో వ్యాజ్యాన్ని పెండింగ్‌లోనే ఉంచాలన్నారు. తాజాగా నోటీసు ఇస్తే దానిపై అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయడానికి వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రధాన వ్యాజ్యంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

సీఐడీ నోటీసులపై హైకోర్టు న్యాయవాదుల సంఘం మరో నిర్ణయం: మార్గదర్శి చిట్స్‌ వ్యవహారంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై.. హైకోర్టు న్యాయవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ నోటీసులపై చర్చించేందుకు అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించాలంటూ కార్యనిర్వాహణణ కమిటీని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. ఈమేరకు 268 మంది న్యాయవాదుల సంతకాలు సేకరించింది.

మార్గదర్శి వ్యవహారంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీ ప్రొషెషనల్‌ ఫోరం ఈనెల 2న విజయవాడలో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించాగా.. అందులో హైకోర్టు న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఆడిటర్‌ శ్రవణ్‌కు.... అరెస్ట్‌ నుంచి చట్టబద్ధ రక్షణ ఉంటుందని.. అంతేకాక చిట్‌ఫండ్‌ వ్యవహారాలను నిర్ణయించే నిపుణత సీఐడీకి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చిన న్యాయవాదులకు.. సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు న్యాయవాదుల సంఘం.. హైకోర్ట్‌ కార్యనిర్వాహణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.

ఆ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు ఆధారాలను తమ ముందు ఉంచాలని సీఐడీ కోరినట్లు తెలిపింది. అభిప్రాయ వ్యక్తీకరణ కేవలం భావప్రకటన స్వేచ్ఛమాత్రమే కాకుండా... న్యాయవాదుల వృత్తి ధర్మమని, పోలీసుల ముందు ఆధారాలు సమర్పించాకే అభిప్రాయలను వ్యక్తీకరించాలని చెప్పడం నిస్తేజమైన వాదనని ఆక్షేపించింది. అభిప్రాయాలు వ్యక్తపరిచిన ప్రతి నిపుణుడికీ.. నోటీసులివ్వడం అంటే భావప్రకటనా స్వేచ్ఛను అపహాస్యం చేయడమే అవుతుందని.. పేర్కొంది. ఇలాంటి చర్యలు వేధించడం తప్ప మరొకటి కాదని. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని.. చట్టబద్ధపాలన రక్షించేందుకు గళమెత్తుతున్న న్యాయవాదులు, ప్రజలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. న్యాయవాదుల సంఘం.. హైకోర్ట్ కార్యనిర్వాహక కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో అభిప్రాయాలు వ్యక్తంచేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీర్పు చెప్పిందని గుర్తు చేసింది. నిరసన వ్యక్తంచేయడం ప్రజాస్వామ్యానికి.. భద్రతా కవాటం అని సుప్రీంకోర్టు సీజే ఇటీవల తెలిపారని గుర్తుచేసింది. నిరసన అణిచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగించడం వల్ల భయానక వాతావరణం ఏర్పడుతుందని.. ఆందోళన వ్యక్తం చేసింది.

న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తంచేయడంపై.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం స్పదించడాన్ని తీవ్రంగా ఖండించకపోతే రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో..న్యాయవాదుల నిబద్ధతపై అనుమానాలు తలెత్తుతాయని తెలిపింది. న్యాయవాదుల హుందాతనాన్నికాపాడాల్సిన అవసరం ఉందని,... న్యాయవాదుల హక్కుల పరిరక్షణపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు సర్వసభ్య సమావేశం నిర్వహించాలని హైకోర్ట్ కార్యనిర్వాహక కమిటీని కోరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.