గుంటూరు జిల్లా చిలకలూరిపేట కి చెందిన కె. ఆంజనేయులుకి కళామందిర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఖాతా ఉంది . తన అకౌంట్లోని 80 వేల రూపాయల నగదు మాయం అయ్యింది. విషయాన్ని బాధితుడు వెంటనే బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వగా..ఏటీఎం ద్వారా జార్ఖండ్ లో డబ్బులు విత్ డ్రా చేసినట్లుగా ఉందని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఇంతవరకు ఎప్పుడు జార్ఖండ్ వెళ్లలేదని అక్కడ ఎలా డ్రా చేస్తానని బాధితుడు వాపోయాడు. సమస్య పరిష్కారం కోసం బ్యాంక్ అధికారులను కోరితే పోలీసుల దగ్గరికి వెళ్లి ఎఫ్ఐఆర్ తీసుకురండి అని చెప్పారన్నారు. అక్కడికి వెళ్తే సీఐ, ఎస్ఐలు ఒక లెటర్ ఇచ్చి ఇది సరిపోతుందన్నారు. ఇలా బ్యాంక్ అధికారి, అటు సీఐ ఇద్దరు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారని తనకు న్యాయం చేయాలంటూ ఆంజనేయులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రివీన్స్ లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. 80 వేల నగదు ను ఇప్పించాలని కోరుతూ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్
: