భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వరంగల్ లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కట్టా రామకృష్ణకి గుంటూరు గోరంట్లకు చెందిన జ్యోతికి 2 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో పనిచేసే రామకృష్ణ ... వరంగల్‌కు బదిలీ అయ్యాడు. పెళ్లయిన మొదటి సంవత్సరం తర్వాత ఆస్తిలో భాగాన్ని, మరికొంత కట్నం ఇవ్వాలని తరచూ వేధిస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. తాను వరంగల్ లో పని చేస్తున్నా కానీ ఇప్పటివరకు తనను గుంటూరులోనే వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. తనను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఇదేంటి అని పెద్దల సమక్షంలో ప్రశ్నించగా మీ అమ్మాయి అందంగా లేదు.. ఆస్తి సరిపోలేదు... కట్నం కొంచెం ఇచ్చారని భర్త తరపు బంధువులు అంటున్నారన్నారు. తన భర్త రామకృష్ణ ఏకంగా తనపై దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది . న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది.
ఇవీ చదవండి