శాసనమండలి వాయిదా పడటంపై రాజధాని రైతులు, అమరావతి ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మండలి సాంకేతిక కమిటీకి పంపారని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగా... ప్రభుత్వం బలవంతంగా రెండు బిల్లుల్ని మళ్లీ ప్రవేశపెట్టడం తమను ఇబ్బంది పెట్టడానికేనని ఆరోపించారు. తాజాగా మండలి వాయిదా పడటం నైతికంగా తమ విజయమని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు కోరారు.
ఇదీ చూడండి: