ETV Bharat / state

AP BJP: జగన్.. విద్యుత్ భారంపై మడప తిప్పారు: సోము వీర్రాజు - సీఎం జగన్ పై సోము వీర్రాజు ఫైర్

విద్యుత్ బిల్లుల పెంపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై అధిక కరెంట్ బిల్లులు విధించడమేంటని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పదే పదే చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్నదేంటని దుయ్యబట్టారు.

ap bjp
ap bjp
author img

By

Published : Sep 13, 2021, 7:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు భారంపై మడమ తిప్పిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయం తగ్గి కుదేలవుతున్న ప్రజలకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని పాదయాత్రలో పదే పదే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదేళ్ల క్రితం నాటి ఖర్చుల వ్యత్యాసం వసూళ్ల కోసం మడమ తిప్పారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. సామాన్యుడి నెత్తిమీద ప్రతినెలా అదనపు ఆర్థిక భారం నెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు కరెంటు బిల్లులకు లింకు పెట్టిన తరుణంలో ఈ అదనపు భారం వల్ల పింఛన్లు కోల్పోతామనే భయం లబ్ధిదారుల్లో నెలకొంటోందని.. వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఏడాది మార్చి వరకు ఈ అదనపు భారంపడే పరిస్థితి ఉందని.. సుమారుగా రూ.3,800 కోట్ల వరకు సర్ధుబాటులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇల్లు ఈ భారం మోయాల్సిందే అన్నట్లు ప్రభుత్వ విధానం కనిపిస్తోందన్నారు సోము వీర్రాజు. 2019-20 విద్యుత్ టారిఫ్​లో అనుమతించిన వ్యయానికి వాస్తవ ఖర్చులకు మధ్య తేడా రూ.2,542 కోట్లుగా ట్రూ ఆప్ పిటిషన్​ను విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేశాయన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇస్తే ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం సర్దుబాటు పేరుతో రూ.2,542 కోట్లు కట్టించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధం అవుతాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు. విద్యుత్ వినిమయం తగ్గినా ఇతర కారణాలు చూపిస్తూ విద్యుత్ సంస్థలు మరోసారి ఈ అదనపు వ్యయాన్ని సామాన్యునిపై రుద్దేలా ప్రణాళికలు రచిస్తున్నాయని దుయ్యబట్టారు.

  • ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రతినెలా ఒక్కోవిద్యుత్ వినియోగదారుడి ద్వారా₹200-₹300 గుంజుతూ మొత్తం ₹3800కోట్ల వసూలు లక్ష్యంగాపెట్టుకున్న @ysjagan గారిప్రభుత్వం,అదే విధానంద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా అదనపుభారం వేయాలని ప్రయత్నించడాన్ని @BJP4Andhra తీవ్రంగావ్యతిరేకిస్తోంది.(1/2) pic.twitter.com/WkyAr7R1lH

    — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

CBN: రేపట్నుంచి 5 రోజులపాటు 'రైతు కోసం పోరుబాట': చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.