పదోన్నతులు కల్పించాలంటూ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. గత మూడు నెలల నుంచి పదోన్నతులు ఇవ్వకుండా ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని నిరసిస్తూ విశ్వవిద్యాలయంలో ధర్నాకు దిగారు. సిబ్బంది బస్సులను అడ్డుకుని రోడ్డుపైనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు పదోన్నతులు కల్పించడంలో అలసత్వం వహించిన ప్రభుత్వం సీపీఎస్‌ను ఏ విధంగా రద్దు చేస్తోందని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: