గుంటూరులో కరోనా రోగులకు యాంటిబాడీ కాక్‌టెయిల్ ఇంజక్షన్‌ను ప్రయోగించారు. ప్రముఖ వైరాలజిస్ట్ కల్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ఇంజక్షన్ వినియోగించారు. నగరంలోని శ్రీ హాస్పిటల్లో కొవిడ్‌తో బాధపడుతున్న ఇద్దరు రోగులకు రీజెనరాన్ ఇంజక్షన్‌ను వినియోగించారు. రీజెనరాన్తో 24 గంటల్లో మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ తెలిపారు.
ఇంజక్షన్ ప్రయోగించిన బాధితులను త్వరలో ఇంటికి పంపుతామని వైద్యుడు చక్రవర్తి అన్నారు. కరోనా రోగులకు ఈ ఔషధం వాడితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 70 శాతం మంది త్వరగా కోలుకున్నారని వెల్లడించారు. రీజెనరాన్ డోసు ధర రూ.60 వేలు ఉండటంతో ఈ మొత్తాన్ని వెచ్చించి పేదలు చికిత్స పొందడం కష్టం అవుతున్నందున... ఔషధాన్ని ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: