గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో మహిళపై రాళ్ల దాడి కేసులో మరో 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అరెస్టయ్యారు. గత నెల 27న జరిగిన రాళ్ల దాడిలో మరియమ్మ అనే మహిళ మృతి చెందారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు... బాధ్యులపై 147, 148, 302, 324, 109 రెడ్ విత్, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల మధ్య తలెత్తిన స్వల్ప బేధాభిప్రాయాలే ఘటనకు కారణమని ఏఎస్పీ ఎన్వీఎస్ మూర్తి చెప్పారు. వీరిని మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్నామని ఏఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: వెలగపూడిలో రణరంగం... ఇరు వర్గాల ఘర్షణలో మహిళ మృతి