![ammavari structure on peepal leaf at pedaravuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-gnt-09-24-durgamma-on-leaf-av-3053245_24102020215133_2410f_1603556493_254.jpg)
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించాడు. చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పణిదెపు వెంకటకృష్ణ రావి ఆకుపై దుర్గమ్మ చిత్రాన్ని చిత్రీకరించారు. మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారిని రావి ఆకుపై సాక్షాత్కరింపజేశారు.
![ammavari structure on peepal leaf at pedaravuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-gnt-09-24-durgamma-on-leaf-av-3053245_24102020215133_2410f_1603556493_453.jpg)
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ... ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వెంకటకృష్ణ వివరించారు. ఈ చిత్రం ద్వారానే బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి. రేపే విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం