ETV Bharat / state

అమ్మఒడి పథకానికి అర్హులెవరు.. నిబంధనలేం చెబుతున్నాయ్‌..?

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న అమ్మఒడి పథకానికి అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాలో రూ. 15 వేల నగదును అధికారులు జమ చేయనున్నారు. దీని కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలను చదివించే తల్లులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తారు. ఇప్పటి వరకూ 45 లక్షల మందిని గుర్తించినట్టు వెల్లడించింది.

అమ్మఒడి పథకానికి అర్హులెవరు
author img

By

Published : Nov 5, 2019, 4:26 PM IST

అమ్మఒడి పథకానికి అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలు

అమ్మఒడి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. 2019-20 విద్యా సంవత్సరానికి 45 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లల్ని చదివించే తల్లులకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిచనున్నారు.

ప్రైవేటు విద్యార్థులకూ వర్తింపు

ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు, జూనియర్​ కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల తల్లి బీపీఎల్ వర్గానికి చెందినవారై ఉండాలి. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్​ లేకుంటే అందుకు దరఖాస్తు చేసిన రసీదు ఉండాలి.

అనాథలైతే స్వచ్ఛంద సంస్థ ఖాతాలో

పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతోన్న అనాథలు, వీధిబాలలకూ ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. ఆర్ధిక సాయాన్ని స్వచ్ఛంద సంస్థ లేదా ప్రభుత్వ విభాగం ఖాతాలో జమ చేయనున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్ధులు 75 శాతం హాజరు తప్పని సరి చేశారు. పాఠశాల లేదా కళాశాల నుంచి మధ్యలోనే మానేస్తే పథకానికి అనర్హులు. అర్హులైన లబ్ధిదారులకు ఏటా జనవరిలో డబ్బులు జమ చేస్తారు.

ఇదీ చూడండి:

'మూడేళ్లు.. మూడు దశలు.. నాడు-నేడు కార్యక్రమం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.