అమ్మ ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చికుందామె... అమ్మ పై ప్రేమతో ఇంటి పెరడునే వనంలా మార్చేశారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటూ ఇంటనే నందన వనంలా మార్చారు వరలక్ష్మి.
గుంటూరు జిల్లా రేపల్లె ఇండియన్ బ్యాంక్ వీధిలో కోటంరాజు వరలక్ష్మి తన తల్లి పద్మావతికి ప్రకృతంటే ఇష్టమని... ప్రకృతినే ఇంటికి ఆహ్వానించేశారు. కేవలం ఇంటి బయటే కాదు... లోపలా పచ్చదనంతో నింపేశారు.
అనాస, నారింజ, బాదం, డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, బ్రహ్మకమలం ఇలా 50 రకాల మొక్కలున్నాయి... ఎక్కడ కొత్త రకం కనిపించినా సేకరిస్తారు. విజయవాడ, విశాఖ, గుంటూరు వెళ్లి మరీ మొక్కలు తీసుకొస్తారామె.
ఇదీ చదవండి