ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించినందుకు పవన్‌కల్యాణ్‌కు ప్యాకేజీలు వస్తున్నాయని... వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని... దానిని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్... ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి చాలాసార్లు తిరుమలకు వెళ్లారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్... ఇసుక, ఆంగ్లమాధ్యమం నిర్ణయాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దూతగా... పవన్ కల్యాణ్‌ను దిల్లీకి పంపించారని ఆరోపించారు.
ఇదీ చదవండీ... వైకాపా ఎంపీలతో జగన్ భేటీ... పలు అంశాలపై చర్చ