Amaravati Women Farmers: ప్రభుత్వానికి భూములు ఇస్తే తమను విచారణ పేరుతో న్యాయస్థానాల్లో చుట్టూ తిప్పుతున్నారంటూ.. అమరావతి మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమంలో భాగంగా మందడం కూడలిలో ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 14 మందిపై కేసులు పెట్టారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మిగిలిన 13 మంది మంగళగిరి న్యాయస్థానానికి హాజరయ్యారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ కోర్టులో విచారణకు పాల్గొన్నారు. ఎప్పుడూ ఇంటికి పరిమితమైన తమను ఈ ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొనేలా చేసిందని మహిళలు చెప్పారు. తమ ఆకాంక్ష కోసం ఉద్యమం చేస్తే.. ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేసి కోర్టుకు ఈడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇవీ చదవండి: