Amaravati farmers: కోర్టు తీర్పులు వచ్చినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు కనిపించడంలేదు.పైగా శాంతి యుతంగా నిరసన తెలిపే రైతులకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అనేక ఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో అమరావతి రైతులు దిల్లీ వెదికగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అమరావతి ఉద్యమం మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని రైతులు దిల్లీ యాత్ర చేపట్టనున్నారు. తుళ్లూరులో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాజధానిగా అమరావతి కొనసాగించటం, హైకోర్టు తీర్పుని అమలు చేయటంపై దిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు.
2019 డిసెంబర్ 17న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారు. అప్పటి నుంచి రాజధాని రైతులు, అమరావతి మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ డిసెంబర్ 17కు ముఖ్యమంత్రి ప్రకటనకు మూడేళ్లవుతుంది. అమరావతి పోరాటాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తమ గోడు వినిపించేందుకు దిల్లీ యాత్ర చేస్తున్నట్లు ఐకాస నేతలు చెబుతున్నారు. రైతుల దిల్లీ యాత్రకు తెలుగుదేశం పార్టీ మద్దతిస్తున్నట్లు తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రకటించారు. మిగతా రాజకీయ పక్షాలు కూడా మద్దతుగా నిలబడాలని కోరారు.
ఇవీ చదవండి: